Shivaji : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి మొన్నటి వరకు శివాజీ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. సామాన్యులకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది అంటూ శివాజీ తన సొంత బిడ్డని చూసుకున్నట్టుగా ప్రశాంత్ ని చూసుకున్నాడు. అయితే ప్రశాంత్ పూర్తి శివాజీ మీద ఆధారపడి ఉన్నాడు. స్వతంత్రం గా నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది హౌస్ మేట్స్ తో పాటుగా, నెటిజెన్స్ అభిప్రాయం కూడా.
సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే మరో విషయం ఏమిటంటే శివాజీ లేకపోతే అసలు పల్లవి ప్రశాంత్ ఇన్ని రోజులు హౌస్ లో ఉండేవాడు కాదు అని. గేమ్స్ ఆడడం లో నిజంగా శివాజీ ప్రమేయం ఏమి లేదు కానీ, నామినేషన్స్ విషయం లో మాత్రం శివాజీ ప్రమేయం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం అర్జున్ మరియు రతికా ఈ విషయాన్నీ హైలైట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసారు.
ఇదంతా పక్కన పెడితే ఈ వారం ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కుని బిగ్ బాస్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అందరూ గెలవడానికి తమ వైపు నుండి నూటికి నూరు శాతం కృషి చేసారు. ఈ క్రమం లోనే శివాజీ కూడా టాస్కు గెలవడానికి చాలా కష్టపడ్డాడు. ఈ హీట్ మూమెంట్ లో ఆయన బాణాల టాస్కులో ఓడిపోవడం తో ఉక్రోషానికి గురి అయ్యాడు. పల్లవి ప్రశాంత్ మాట్లాడడం వల్లే నా ఫోకస్ తప్పింది, అందుకే ఓడిపోయాను అంటూ ప్రశాంత్ పై చిరాకు పడుతాడు.
నా మీదకి నేడుతావు ఏంటన్నా, నువ్వు ఫోకస్ గా ఉండాలి కానీ అని అంటాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత సంచాలక్ గా వ్యవహరించిన శోభా శెట్టి తో గొడవకి దిగుతాడు శివాజీ. నువ్వు అరిస్తే నేను నీకంటే పెద్దగా అరుస్తాను అంటూ శోభా శెట్టి పై రెచ్చిపోతాడు. ఇదంతా చూసి ఈమధ్య శివాజీ కి ఊరికే కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా టాస్కులు ఓడిపోయినప్పుడు ఉక్రోషం తో రగిలిపోతున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.