Shekar Master : ప్రస్తుతం ఇండియా లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ తీస్తే అందులో శేఖర్ మాస్టర్ కచ్చితంగా ఉంటాడు. తెలుగు లో అయినా తమిళం లో అయినా టాప్ స్టార్స్ కి ఆయన కొరియోగ్రఫీ చేస్తూ వచ్చాడు. రాకేష్ మాస్టర్ శిష్యరికం లో డ్యాన్స్ నేర్చుకున్న శేఖర్ మాస్టర్ ఢీ డ్యాన్స్ షో ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టెప్పులను కంపోజ్ చెయ్యడం లో ప్రస్తుతానికి శేఖర్ మాస్టర్ ని మించినోడు లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లాంటి డ్యాన్స్ వేసే స్టార్స్ ని, అలాగే మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కి కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు శేఖర్ మాస్టర్ చూడచక్కని స్టెప్పులు వెయ్యిస్తాడు.

ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఆయన ఢీ షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో లో శేఖర్ మాస్టర్ హైపర్ ఆది మరియు ఇతర టీం లీడర్స్ తో వేసే జోకులు, పంచులు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. తాను ఒక్క పెద్ద డ్యాన్స్ మాస్టర్ అనే ఫీలింగ్ శేఖర్ మాస్టర్ లో అసలు ఉండదు. పంచులు వేస్తాడు, ఎవరైనా తన పంచ్ వేస్తే సరదాగా నవ్వుతూ తీసుకుంటాడు కూడా. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్ అయిపోయాడు.

ఆయన కావాలని ప్రోమో కోసం చేసాడో, లేకపోతే నిజంగా కోపం వచ్చిందో తెలియదు కానీ యాంకర్ శివ పై ఫైర్ అయ్యాడు. యాంకర్ శివ మాట్లాడుతూ ‘మీకు ఆ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంట కదా’ అని అంటాడు. అప్పుడు శేఖర్ మాస్టర్ ‘ఇది కోట్ల మంది చూస్తున్న షో..నాకు పెళ్లి అయ్యింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నన్ను అడగాల్సిన ప్రశ్ననేనా ఇది?, ముందు అతన్ని బయటకి పంపండి, అప్పుడే నేను ఈ షోకి వస్తాను’ అంటూ శేఖర్ మాస్టర్ వాకౌట్ అవుతాడు. అయితే ఆయనకీ నిజంగానే కోపం వచ్చిందా, లేకపోతే సరదాగా చేసారా అనేది తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే.
