టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగిన ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ మరో 15 రోజుల్లో తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పబోతున్నాడు. కొంత కాలం నుండి రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న శర్వానంద్, ఈ ఏడాది జనవరి నెలలో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్ధ వేడుకకి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు.
ఇప్పుడు పెళ్లి తంతు ముందుకొచ్చేసింది, జూన్ 3 వ తారీఖున శర్వానంద్ రాజస్థాన్ లోని జైపూర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రెండు రోజుల పాటు సాగే ఈ వివాహ మోహోత్సవానికి అక్కడి లీలా ప్యాలస్ వేదిక కానుంది. ఈ వివాహ మహోత్సవానికి శర్వానంద్ కుటుంబ సభ్యులతో పాటుగా మిత్రులు మరియు సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.
ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు శర్వానంద్ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఎలాంటి వార్తలు వచ్చాయో మన అందరికీ తెలిసిందే. జనవరి లో నిశ్చితార్థం చేసుకున్న వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి..?, వీళ్లిద్దరు విడిపోబోతున్నారా!, ఇలాంటి వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
ఈ విషయం శర్వానంద్ వరకు వెళ్ళింది, ఆయన వెంటనే స్పందించి తన PR టీం తో అలాంటిదేమి లేదని, ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతోందని, 40 రోజుల నుండి ఆ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నానని, ఇండియా కి వచ్చిన తర్వాత ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు గా తన టీం తో చెప్పించాడు.ఇక రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ లోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టిన మరుక్షణమే ముహుర్తాలు కూడా పెట్టించేసాడు.