Shankunthalam : ‘మహాభారతం’ ప్రారంభం అవ్వడానికి ముందు దుష్యంత మహారాజు మరియు శకుంతల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, భరతుడి జననం వంటి ఇతివృత్తాలను ఆధారంగా తీసుకొని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ చిత్రం ఈ నెల 14 వ తారీఖున విడుదల కాబోతుంది.గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు, సహా నిర్మాత కూడా.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించాడు.ఈ చిత్రం కోసం గుణ శేఖర్ భారీ లెవెల్ లో ఖర్చు చేసాడు.

కానీ టీజర్ దగ్గర నుండి ట్రైలర్ వరకు ఆడియన్స్ ని విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది.గ్రాఫిక్స్ కూడా చాలా పూర్ గా అనిపించాయి.అయితే మహాభారతం కి సంబంధించిన కథ కాబట్టి బోరింగ్ అనేది ఉండదని విశ్లేషకుల బలమైన నమ్మకం.ఈ చిత్రం మీద గుణశేఖర్ నమ్మకం విశ్లేషకుల నమ్మకాన్ని మించినది అని చెప్పొచ్చు.అందుకే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ బిగ్ స్క్రీన్ లో 3D షో ని ప్రదర్శించారు.

టాక్ బాగా వస్తుందనే నమ్మకం తో ఉండేవారు మేకర్స్, కానీ కథ అడ్డం తిరిగింది.ఈరోజు ఈ సినిమాని చూసి వచ్చిన కొంతమంది నెటిజెన్స్ ఈ చిత్రం ఆడుతున్న థియేటర్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లొద్దు అంటూ కామెంట్ చేసారు.ఈ రివ్యూస్ చూసి సమంత ఫ్యాన్స్ బాగా నిరాశకి చెందారు.ఎదో ఒకరిద్దరు అలాంటి టాక్ ని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు అదే విధమైన కామెంట్స్ చేస్తున్నారు.

గ్రాఫిక్స్ చాలా దరిద్రం గా ఉన్నాయని, అసలు గుణశేఖర్ ఏమనుకొని ఈ చిత్రాన్ని చేసాడో అర్థం కావడం లేదని ట్వీట్స్ వేశారు.స్క్రీన్ ప్లే కూడా అసలు ఏమాత్రం బాగాలేదని, ఒక్కడు మరియు చూడాలని ఉంది లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తీసిన గుణ శేఖర్ నుండి ఇలాంటి ఔట్పుట్ ని ఇవ్వడం ఏమిటో అని ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.కానీ ఒక్క షో నుండి వచ్చే టాక్ కి మరియు భారీ రిలీజ్ మీద వచ్చే టాక్ కి చాలా తేడా ఉంటుంది.కాబట్టి 14 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా టాక్ ఇదే రేంజ్ లో వస్తుందా లేదా పాజిటివ్ టాక్ వస్తుందా అనేది చూడాలి.
