Shahrukh Khan : బాలీవుడ్ లో పార్టీ కల్చర్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోలు, హీరోయిన్లతో పాటు, సెలెబ్రిటీలు కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. గత కాలంగా మన టాలీవుడ్ లో కూడా ఈ సంస్కృతి కొనసాగుతుంది అనుకోండి..కానీ బాలీవుడ్ స్థాయికి మాత్రం ఈ విషయం లో మన టాలీవుడ్ ఇంకా ఎదగలేదు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో కలిసి ‘ది ఆర్చీస్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడినట్టు, ప్రేమలో పడినట్టు బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. ఈమధ్య కాలం లో ఏ పార్టీ లో చూసిన వీళ్లిద్దరు జంటగా కనిపిస్తున్నారు. ఒకటి రెండు సార్లు కలిసి సినిమా చేస్తేనే హీరో హీరోయిన్ మధ్య ఎదో జరుగుతుంది అని అనుకుంటున్న ఈ కాలం లో, ఇన్ని పబ్లిక్ పార్టీలలో కలిసి తిరుగుతుండడం ని చూసి బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఈ ఇరువురి కుటుంబాల నుండి కూడా వీళ్లిద్దరికీ స్వేచ్ఛ లభించినట్టు తెలుస్తుంది. అందుకే ఈ స్థాయిలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా సుహానా ఖాన్ ముస్లిం, అగస్త్య నంద బ్రాహ్మణుడు.
ఇలా రెండు భిన్నమైన మతాలకు చెందిన వీరు పెళ్లి చేసుకుంటారా అని అందరు ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఒక హిందువు అనే విషయం. బాలీవుడ్ సెలబ్రిటీస్ కులమతాలకు అతీతంగా ఉంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం గా చెప్పుకోవచ్చు. మరి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎప్పుడు పెళ్లి పీటల వరకు దారి తీస్తోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ హీరో అమితాబ్ బచ్చన్, ప్రస్తుత నెంబర్ 1 హీరో షారుఖ్ ఖాన్ బంధువులు అవ్వబోతున్నారన్నమాట.