LEO : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’. ‘విక్రమ్’, ‘ఖైదీ’ మరియు ‘మాస్టర్’ సినిమాలతో సౌత్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్, వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ తో కలిసి చేసిన సినిమా కావడం తో సహజం గానే ఈ చిత్రం పై అంచనాలు భారీ గా ఉంటాయి.
దానికి తోడు విడుదలకు ముందు అనిరుద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రం పై ఉన్న అంచనాలను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ రేంజ్ అంచనాలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా ఫ్లాప్ కాదు, సూపర్ హిట్ అనే చెప్పాలి. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టింది.
ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ కూడా తీసి ఉంటే ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరి ఉండేదని అభిమానుల అంచనా. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రాన్ని బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ చూశాడట. ఆయనకీ ఎందుకో ఈ సినిమా నచ్చలేదని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఈ సినిమాకి ముందు లోకేష్ తో ఒక సినిమాని ఓకే చేసుకున్నాడట షారుఖ్ ఖాన్.
కానీ లియో చిత్రం చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ తో సినిమా చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నాడట. తన టీం తో ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినట్టుగా చెప్పించాడట. కనీసం కారణం కూడా చెప్పనందుకు లోకేష్ బాగా ఫీల్ అయ్యాడట. ప్రస్తుతం లోకేష్ రజినీకాంత్ తో సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు, ఈ సినిమా తర్వాత ఆయన ఖైదీ 2 చెయ్యబోతున్నాడు.