Shah Rukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ పరిచయం అక్కర్లేదు. ఆయన ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారతదేశ సినీ రికార్డులను తిరగరాసింది. వాస్తవానికి షారుక్ ఖాన్ సాధారణంగా చాలా కూల్ గా కనిపిస్తారు. తాజాగా ఆయన తన మేనేజర్‌తో కలిసి ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ సమయంలో అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. వైరల్ అవుతున్న వీడియో మంగళవారం సాయంత్రం షారూక్ ఎక్కడికో వెళ్తున్నట్లు కనిపించాడు. ఈ సమయంలో అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా అతనితో ఉన్నారు. అయితే షారుక్ తన ముఖాన్ని హూడీతో దాచుకున్నాడు.
షారుక్ మేనేజర్‌తో కలిసి తన కారు వైపు వెళుతున్నప్పుడు తన ఫోటోలను క్లిక్ చేస్తున్న అభిమానుల్లో ఒకరి ఫోన్‌ను లాక్కొన్నాడు. తీసుకుని ఆగకుండా నేరుగా కారు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. దీంతో అభిమాని అవాక్కయ్యాడు. షారుక్ ప్రవర్తన కారణంగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ వరుస హిట్లు సాధించాడు. అతని రెండు చిత్రాలు జవాన్, పఠాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. డిసెంబర్‌లో విడుదలైన మూడో చిత్రం డుంకీకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
షారుక్ ప్రస్తుతం మరో కొత్త సినిమాలో నటించబోతున్నాడు. అందులో రియల్ ఏజ్ క్యారెక్టర్‌ని చేస్తానని షారూక్ ప్రకటించాడు. కొద్దిరోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మార్చి లేదా ఏప్రిల్‌లో కొత్త సినిమా చేస్తాను. నేను నా అసలు వయసులో ఉండి ఇంకా ఆ సినిమాలో హీరోగా నిలదొక్కుకునే సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నాను.’ అంటూ చెప్పుకొచ్చారు.