Bigg Boss : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్కు ఎంతటి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఈ షో మారింది. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు అభిమానుల విషయంలో జోరుగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై బిగ్ బాస్ నిర్వహణలో చాలా మార్పులు జరగనున్నాయట. బిగ్‌బాస్ సీజన్ 7 భారీ సక్సెస్.. అద్భుతమైన టీఆర్పీ వచ్చినప్పటికీ ఆ ఆనందాన్ని మేకర్స్ ఆస్వాదించక ముందే వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ షో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అదే స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.

టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టుతో షో రెపిటేషన్ భారీగా దెబ్బతింది. బిగ్‌బాస్ ను ఆపేయాలన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు పెట్టిన కండిషన్స్ లెక్కచేయకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసి మరింత గొడవకు కారణమయ్యాడని అతడికి కోర్ట్ కొన్ని రోజుల పాటు రిమాండ్ విధించింది. తర్వాత బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు. ఇక పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడి చేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరి కొంతమంది నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తిస్తున్నారు. ఇంకా చాలామంది అరెస్టయ్యే అవకాశం కూడా ఉందట. ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని.. కంటెస్టెంట్ గా ఎంపికైన వారితో అగ్రిమెంట్ చేయించుకోబోతున్నారట. ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్, విన్నర్, ఫైనలిస్ట్ ఎవరైనా సరే ర్యాలీలు నిర్వహించకూడదు. అభిమానులను అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కలవనేకూడదని కండీషన్ పెట్టాలని భావిస్తున్నారట.

ఇక దీన్ని బట్టి నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరూ ర్యాలీతో అభిమానుల దగ్గర అయ్యే అవకాశం ఉండదు. నేరుగా ఇంటికి వెళ్లి పోయే విధంగా బిగ్ బాస్ ఒప్పందం కుదుర్చుకుపోతున్నారు. ఇక పోలీసులు కూడా ఇదే సూచనలు బిగ్ బాస్ యాజమాన్యానికి చెప్పాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ నిర్ణయం అని.. నెక్స్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోడ్ల మీద ర్యాలీ చేయడం కుదరదని తెలుస్తోంది. ఇది నిజంగానే బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. అయితే నిజంగా ర్యాలీలో మీద నిషేధం విధించారా.. కంటెస్టెంట్స్ అభిమానులను కలవాలంటే కచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందేనా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.