ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లు చాలా మంది తమ ఇష్టంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.. వారి జాబితాలోకే వచ్చింది ఇంద్రజ. యమలీల వంటి సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారింది. సీనియర్ హీరో నరేశ్ సరసన నటించిన సొగసు చూడతరమా సినిమా ద్వారా ఇలాంటి భార్య ప్రతి ఒక్కరికీ ఇండాలనేలా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూనే ఇటు తన గ్లామర్ తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో జడ్జీగా బుల్లి తెరపై వెలుగులోకి వచ్చింది. వెండి తెరకంటే ప్రస్తుతం బుల్లి తెరపై ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ప్రజెంట్ ఇంద్రజ వెండి తెర పై కూడా తల్లి పాత్రలు పోషిస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. బుల్లి తెరపై జబర్దస్త్-ఎక్స్ట్రా జబర్ధస్త్– శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోస్ ద్వారా అలరిస్తోంది.
ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అది ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్ టీంతో ఎపిసోడ్ రాబోతుంది. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. దీంట్లో సీనియర్ యాక్టర్ ఇంద్రజ స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కిపోతుంది. అంతలా ఆమె ఏడవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఆమె చాలా రోజుల తర్వాత తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఇంద్రజ ఎమోషనల్ అయ్యి ఏడ్చడం మొదలు పెట్టింది. ఓ కళాకారుడికి ఇలాంటి భావోద్యేగం ఉండడం చాలా సహజం. అందువల్లే ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరు అందరి గుండెలను కదిలించింది.