తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోయిన్స్ లో మంచి క్రేజ్ , ఫేమ్ దక్కించుకొని దశాబ్దాల పాటుగా ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భానుప్రియ. అందం లో కానీ, నటన లో కానీ, డ్యాన్స్ లో కానీ ఈమెకి ఆరోజుల్లో పోటీ ఇచ్చే హీరోయిన్స్ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మెగాస్టార్ చిరంజీవి లాంటి డ్యాన్సర్లు కూడా ఈమె వేగానికి తట్టుకోలేకపొయ్యేవాళ్ళు. చిరంజీవి అప్పట్లో ఒకానొక ఇంటర్వ్యూ లో భాను ప్రియతో కలిసి డ్యాన్స్ వెయ్యడం చాలా కష్టమైన విషయం అని చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హీరోయిన్ పెళ్లి తర్వాత హీరోయిన్ పాత్రలకు దూరమై క్యారక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా ఆమె గతం లో నటించింది.

ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవితం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఆదర్శ్ కౌశల్ అనే ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ ని పెళ్లాడింది. కానీ దురదృష్టం కొద్దీ ఆయన 2018 వ సంవత్సరం లో గుండెపోటు తో మరణించాడు. భర్త మరణం భానుప్రియ ని మానసికంగా ఎంతో కృంగిపోయేలా చేసింది. ఇది ఇలా ఉండగా గతం లో భాను ప్రియ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతున్న సమయం లో వంశీ అనే స్టార్ డైరెక్టర్ భానుప్రియ ని ప్రేమించాడు.

ఈ విషయం నేరుగా భానుప్రియ అమ్మకి చెప్పి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు భానుప్రియ అమ్మ వంశీ గురించి విచారణ జరిపించగా, అతనికి అప్పటికే పెళ్లి అయిపోయిందనే విషయం తెలిసింది. దీనితో ఆగ్రహించిన భానుప్రియ తల్లి వంశీ ని ఇంటికి పిలిపించి చెప్పుతో కొట్టిందట. ఈ విషయం ఆరోజుల్లో ఒక సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.
