మన టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు మరియు బామ్మ పాత్రలకు రోల్ మోడల్ గా నిల్చిన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో ఒకరు నిర్మలమ్మ. ఈమె ముఖాన్ని చూడగానే మాతృత్వం పొంగిపోతుంది. మన ఇంట్లో ఒక మనిషిలాగానే అనిపిస్తుంది. అంత సహజ నటి ఈమె, ముఖ్యంగా ఈమె సెంటిమెంట్ సన్నివేశాల్లో నటిస్తే ఏడవకుండా ఉండలేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి ఆర్టిస్టు మళ్ళీ ఇండస్ట్రీ లో దొరకడం చాలా కష్టం.

1956 వ సంవత్సరం లో ‘గరుడ గర్వభంగం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నిర్మలమ్మా, 2002 వ సంవత్సరం వరకు విరామం లేకుండా సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు గా ఒక రేంజ్ లో వెలుగొందింది. అలా సుమారుగా 750 కి పైగా చిత్రాలలో నటించిన ఈమె 2009 వ సంవత్సరం లో కన్ను మూసింది.
ఇదంతా పక్కన పెడితే నిర్మలమ్మ కి కొడుకులు కానీ, కూతుర్లు కానీ ఎవ్వరూ లేరా..?, అసలు ఆమె భర్త ఎవరు ..?, ఆమె కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ లో ఎందుకు లేరు అనే సందేహం ఆమెని చూసినప్పుడల్లా అందరిలో కలగడం సహజం. అయితే ఈమె ప్రముఖ నిర్మాత జీవీ కృష్ణా రావు ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఎలాంటి సంతానం లేదు, కానీ ఆడపిల్లలు అంటే వీళ్లిద్దరికీ ఎంతో ఇష్టం.

అందుకే పిల్లలు లేకపోయినా కూడా కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. నిర్మలమ్మ తన యావదాస్తిని మొత్తం ఆమె పేరు మీద రాసింది. కానీ ఆమె మాత్రం చాలా సాధారమైన జీవితాన్ని గడుపుతుంది. తెలంగాణ ప్రాంతం లో ఈమె ప్రస్తుతం ఒక సీనియర్ లెక్చరర్ గా కొనసాగుతుంది. అంత పెద్ద లెజెండ్ నటి కూతురు నేడు ఇంత సాధారణమైన జీవితాన్ని గడపడం నిర్మలమ్మ అభిమానులకు బాధని గురి చేస్తుంది.