Sneha : ప్రొడ్యూసర్ తో సీనియర్ హీరోయిన్ సీక్రెట్ ఎఫైర్.. వైరల్ అవుతున్న ఫోటోలు

- Advertisement -

Sneha : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో స్నేహ ఒకరు. తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. ముంబైలోని తెలుగు కుటుంబంలో పుట్టిన స్నేహ దుబాయ్‌లో పెరిగింది. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మా పక్కింటి అమ్మాయిలా ఉండే స్నేహ… తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తోంది.

ఈ నటి తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంది. సంప్రదాయబద్ధంగా కనిపించి అందరినీ తనవైపుకు లాక్కుంది. తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త తొలి ప్రేమ, విడాకుల గురించి ఈ నటి మనసు విప్పిన సంగతి తెలిసిందే. తాజాగా స్నేహకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకు మేటర్ ఏంటంటే?

- Advertisement -

స్నేహ ప్రసన్నకుమార్‌ను పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఆమెకు మొదటి పెళ్లి అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త ట్రెండ్ అవుతోంది. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. స్నేహ ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించిందని అంటున్నారు. అంతే కాకుండా అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో ఆ నిర్మాత ప్రేమ వ్యవహారాలు స్నేహకు తెలియడంతో పెళ్లిని రద్దు చేసుకుందట. ఆ తర్వాత కొద్దిరోజులుగా ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రసన్నకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని ఓ ప్రముఖ జర్నలిస్టు ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here