Annapoorna Amma : సినీ పరిశ్రమలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి తెలియని వారు ఉండరు. సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బామ్మ క్యారెక్టర్‌లో అలరిస్తోంది. అన్నపూర్ణమ్మ అంటే నాటి తరం నుండి నేటి తరం వరకు పరిశ్రమలోని నటీనటులకు ఎనలేని గౌరవం. ప్రముఖ నటి అన్నపూర్ణ మహిళలపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిళలను అగౌరవపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గాయని చిన్మయితో పాటు తారలు కూడా ఫైర్ అయ్యారు.
మహిళలపై నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మహిళలపై అఘాయిత్యాలకు మహిళలు కూడా బాధ్యులని అన్నారు. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అర్ధరాత్రి స్వాతంత్య్రం అని పిలిచే ఆ రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవారా? ఆడవాళ్లకు స్వాతంత్య్రం ఎందుకు? రాత్రి 12 గంటల తర్వాత మహిళలు ఏం చేస్తారు? ఇతరులను ఎప్పుడూ నిందించవద్దు. మాది కూడా కొంచం తప్పు వుంటుందని అన్నపూర్ణమ్మ చెప్పింది. ఆమె వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఫైర్ అయ్యారు. సీనియర్ నటి అయ్యుండి మహిళల పట్ల అగౌరవంగా ఉందని చిన్మయి అన్నారు. తాను ఎంతగానో గౌరవించే అన్నపూర్ణమ్మ ఇలా మాట్లాడుతుంటే నా గుండె పగిలిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. అన్నపూర్ణమ్మ ప్రకారం ఆడపిల్లలు రాత్రిపూట పుట్టకూడదు.
ఆడపిల్లలుగా పుట్టడమే మన కర్మ అని అంటారు. తాను చెప్పినట్లు చేస్తే ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు ఉండరని వాళ్లు అర్థరాత్రి ఇంట్లోనే ఉంటారని వెల్లడించింది. అంతేగాక ఏవైనా రోడ్డు ప్రమాదాలు, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రాత్రుళ్లు కాకుండా పగటి వేళలోనే జరగాలని అర్థరాత్రి జరిగితే ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాలని ఎద్దేవా చేసింది. ఆడవాళ్ల వేషధారణ వల్లే అత్యాచారాలు జరుగుతుంటాయని చెప్పేవాళ్లున్న సమాజంలో ఆడపిల్లగా పుట్టడం దురదృష్టకరమని గాయని చిన్మయి ఫైర్ అయ్యారు.