సినిమా ఇండస్ట్రీ అనేదే రంగుల ప్రపంచం. దీంట్లో కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు.. హీరోలు కూడా అందంగా ఉండాలి.. లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. మన ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ స్టార్ హీరోలుగా రాజ్యమేలేస్తున్న.. ఆస్కార్ అవార్డులు తెస్తున్నప్పటికీ అక్కినేని నాగార్జున కి ఉండే ఫ్యాన్ బేస్ వేరే. ఆయనలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మరెవరు లేరు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మన్మథుడు నాగార్జున తర్వాతే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లు దాటినా నాగార్జున ఆల్ మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలందరూ తన అభిమానులే. కొడుకులు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా ఇంకా యంగ్ లుక్స్ తో అమ్మాయిల హృదయాలు దోచుకుంటున్నారు. ఇంతలా నాగార్జున యంగ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటా అని చాలామంది ఆరా తీస్తున్నారు.
నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ టాప్ సీక్రెట్ చెప్పేశాడు. ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చినా తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలో రిపోర్టర్స్ అదే ప్రశ్న అడగగా నాగార్జున తన ఫుడ్ సీక్రెట్ ని బయటపెట్టలేదు కానీ.. ఫిట్ నెస్ సీక్రెట్స్ ని .. ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు . “మీరు ఇలా కనపడడానికి ఫుడ్ ని రిస్ట్రిక్షన్ తో తింటారా..?” అంటూ రిపోర్టర్స్ ప్రశ్నించాడు.
నాగార్జున సమాధానం ఇస్తూ..” ఫుడ్ లో ఏం రిస్ట్రక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.. ప్రతిరోజు రాత్రి ఐస్ క్రీమ్ తినందే నిద్రపోను తెలుసా ? నాకు ఐస్ క్రీమ్ తిననిదే నిద్ర పట్టదు.. ఐస్ క్రీమ్ లేకపోతే కనీసం ఓ స్వీట్ అయినా ఉండాల్సిందే. ఎంత తిన్నా రోజూ వ్యాయామం చేయాలి.. తిన్నదానికి తగ్గ వర్క్ అవుట్స్ చేసి కాలరీస్ బర్న్ చేస్తాను . మరీ ముఖ్యంగా తిన్న తర్వాత నైట్ టైం కనీసం ఓ వన్ అవర్ వాక్ చేస్తాను.. ఎక్కువ వాటర్ తీసుకుంటాను. అందువల్ల నేను ఇంత యంగ్ గా కనిపిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.