satyabhama movie review : సత్యభామగా కాజల్ మెప్పించిందా?

- Advertisement -

Satyabhama Movie Review :చిత్రం: సత్యభామ; నటీనటులు: కాజల్‌,  నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి; ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌; నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి; రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల; విడుదల: 07-06-2024

రేటింగ్ : 2.75

టాలీవుడ్​లో సెకండాఫ్ మొదలైంది. ఈ ఏడాది ఫస్టాఫ్​లో చిన్న సినిమాలే విడుదలయ్యాయి. ఇక సెకండాఫ్​లో థియేటర్లో రఫ్ఫాడించడానికి బడా సినిమాలు వస్తున్నాయి. వారానికి మూడు సినిమాలు చొప్పున ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఈ వారం ఆ సంఖ్య కాస్త ఎక్కువే ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘స‌త్య‌భామ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత చాలా పవర్ ఫుల్ పాత్రలో వస్తున్న సినిమా ఇది. హిట్ సినిమాల ద‌ర్శ‌కుడు శ‌శికిరణ్ తిక్క స‌మ‌ర్ప‌ణ‌లో, ఆయ‌న స్క్రీన్‌ప్లే ర‌చ‌న‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీలో కాజల్‌ యాక్షన్‌ మోడ్‌లో అదరగొట్టిందా?

- Advertisement -

ఇది స్టోరీ :  కె. స‌త్య‌భామ (కాజల్ అగర్వాల్) షి టీమ్‌లో ఏసీపీ స్థాయిలో పని చేస్తుంటుంది. చూడటానికి చాలా కామ్​గా క‌నిపించినా, నేర‌స్థుల నుంచి నిజాలు రాబ‌ట్ట‌డంలో మాత్రం టాప్ క్లాస్ కాప్. త‌నకు అప్ప‌జెప్పిన కేసుల్ని అంత సుల‌భంగా వ‌దిలిపెట్ట‌దని పేరు. ర‌చ‌యిత అమరేంద‌ర్ (న‌వీన్‌చంద్ర‌)ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న ఆమె పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్​కే ఎక్కువ టైం ఇస్తుంది. షి టీమ్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడే హ‌సీనా అనే ఓ బాధితురాలు గృహ హింస‌ని అనుభ‌విస్తూ సాయం కోసం స‌త్య‌భామ ద‌గ్గ‌రికి వ‌స్తుంది. నీకేం కాదు, అంతా నేను చూసుకుంటాన‌ని ధైర్యం చెప్పి పంపించాక‌, భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గుర‌వుతుంది. అలా హ‌సీనాతోపాటు, ఎంతో మంది జీవితాల‌తో ఆడుకున్న ఆ నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో స‌త్య‌భామ‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఆ కేసుని ఆమె పర్సనల్​గా తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే: ప‌రిశోధ‌న ప్ర‌ధానంగా సాగే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ఇలాంటివి ఈ మ‌ధ్య తెలుగులో ఎక్కువగా వ‌స్తున్నాయి. ఓ క్రైమ్ జరుగుతుంది. దాన్ని ఎవరు చేశారో అంతుచిక్కదు. ఒక్కో ఆధారం వెతుక్కుంటూ ఆ క్రైమ్ గుట్టువిప్పడానికి ఓ పోలీస్ అధికారో లేదా ఓ డిటెక్టివో, లేదా బాధితుల తరఫు వ్యక్తులో రంగంలోకి దిగుతుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఆ క్రైమ్ చేసిన వారిని పట్టుకునేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఆ చిక్కు ముడులను ఎలా విప్పారన్నదే అసలైన స్టోరీ. సత్యభామ అలాంటి చిత్రమే. కాకపోతే ఇక్కడ క్రైమ్ ఎవరు చేశారో ముందే తెలుస్తుంది. ఆ క్రిమినల్​ను వెతికి పట్టుకోవడమే ఈ సినిమా స్టోరీ. స్టోరీ కొత్తేం కాదు కానీ ఈ స్టోరీని మలిచిన విధానం, శశికిరణ్ స్క్రీన్​ప్లే ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పొచ్చు.

ఎవ‌రెలా చేశారంటే : ఎక్కువ‌గా క‌మ‌ర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా క‌నిపించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ నాయికా ప్ర‌ధాన‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం ఇదే తొలిసారి. ఆమె పాత్ర చాలా కొత్త‌గా అనిపిస్తుంది. స‌త్య‌భామ పాత్ర‌కు తగ్గ‌ట్టుగా ఆమె చాలా యాక్టివ్​గా కనిపించారు. సినిమానంతటిని ఆమె తన భుజాల మీద ఎత్తుకున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో ఆమె ఎంత కష్టపడ్డారో తెలిసిపోతుంది. ఇక న‌వీన్‌చంద్ర‌తో క‌లిసి ఓ స‌న్నివేశంలో ఆమె చూపించిన ఎమోషన్ ఈ సినిమాకే హైలైట్. ఆమె పాత్ర మిన‌హా, ఇత‌ర మ‌రే పాత్ర‌కూ ప్రాధాన్యం లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌దు. మిగిలిన ఏ పాత్ర కూడా ప్ర‌భావం చూపించ‌దు. న‌వీన్‌చంద్రకు న‌టించేందుకు పెద్ద‌గా ఆస్కారం దొర‌క‌లేదు. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. సుమ‌న్ చిక్కాల మేకింగ్‌లో బిగి కొర‌వడింది.

ప్లస్ పాయింట్స్

+ కాజల్ న‌ట‌న
+ కొన్ని ట్విస్టులు
మైనస్ పాయింట్స్
– – ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
చివ‌రిగా: స‌త్య‌భామ‌… ఓ సాధారణ క్రైమ్ థ్రిల్ల‌ర్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here