Pawan Kalyan : ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సత్యశ్రీ. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పవన్ కల్యాణ్ గురించి, ఆయన హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. అటు తాను పలు సినిమాల్లో నటించినా, కొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో తన సీన్లు పోయినట్లు సత్యశ్రీ చెప్పింది.

కొన్ని సినిమాల్లో అయితే, మంచి రోల్స్ కూడా ఎడిటింగ్ లో పోయినట్లు వివరించింది. రోల్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. డబ్బింగ్ కూడా అయిపోయింది. కానీ, సినిమాలో రాని సీన్లు కూడా ఉన్నట్లు చెప్పింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం వచ్చినా, చెప్పిన పాత్రకు చేసే సీన్ కు సంబంధం లేకపోవడంతో చేయనని బయటకు వచ్చేసినట్లు చెప్పింది సత్యశ్రీ. ‘‘సర్దార్ గబ్బర్ సింగ్’ నాకు అవకాశం వచ్చింది. షూటింగ్ దగ్గరికి వెళ్లాను. క్లబ్ లో ఓ డ్యాన్స్ సీన్ చేస్తున్నారు. నాకు చెప్పింది ఒకటి. అక్కడ చేస్తున్నది ఒకటి. నాకు నచ్చలేదు. వెంటనే చేయనని చెప్పి బయటకు వచ్చేశాను.

పవన్ కల్యాణ్ మూవీ అయినా అలాగే వచ్చేశాను. ఈ విషయాన్ని ఎవరో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ఆయన నన్ను పిలిపించారు. ఎందుకు నటించనని చెప్పావట? అని అడిగారు. నాకు భయం వేసింది సర్. అందుకే చేయనని చెప్పాను అన్నారు. మీది ఏ ఊరు? అని అడిగారు. తణుకు అని చెప్పాను. కాసేపు మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఇక వెళ్లు అన్నారు. వెళ్లేటప్పుడు ఫోటో కావాలని అడిగితే ఇచ్చారు. నిజానికి నేను ఆయన అభిమానని, నాతో మాట్లాడిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత ఎక్కువ అయ్యింది’’ అని చెప్పుకొచ్చింది.