Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ స్టోరీ లైన్ ఈ రేంజ్ లో ఉందేంటి..? నాని ఈ సినిమాతో వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు!

- Advertisement -
Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య కాలం లో ఎంచుకుంటున్న కథలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఆమధ్య కాలం లో ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ రావడం తో స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాడు. అలా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇచ్చిన నాని, ఆ తర్వాత అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో తనకంటూ ఒక పెద్ద బ్రాండ్ ఇమేజిని ఏర్పాటు చేసుకున్నాడు. ‘దసరా’ తో మొట్టమొదటిసారిగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కొల్లగొట్టిన నాని, రీసెంట్ గానే ఆ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఆయన ‘అంటే సుందరానికి’ చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ తో కలిసి ‘సరిపోదా శనివారం’ అనే చిత్రం చేస్తున్నాడు.
Saripodhaa Sanivaaram
Saripodhaa Sanivaaram

షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే మొదలయ్యాయి. ఈ చిత్రం లో విలన్ గా నటించిన ఎస్ జే సూర్య ఇటీవలే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా, ఈ ఇంటర్వ్యూ లో ఆయన ‘సరిపోదా శనివారం‘ కి సంబంధించిన స్టోరీ లైన్ ని చెప్పాడు. ఆ స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి సినిమా మీద మరింత అంచనాలను పెంచేలా చేసింది. స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రం లో హీరో కి చిన్నతనం నుండి విపరీతమైన కోపం ఉంటుంది.

Saripodhaa Sanivaaram Teaser: Nani Returns as an Angry Young Man Ready for Destruction in Vivek Athreya's Upcoming Film (Watch Video) | 🎥 LatestLY

ఈ కోపాన్ని కంట్రోల్ చెయ్యడానికి అతని తల్లి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆమె హీరో తో ఒక మాట చెప్తూ ‘నీ కోపాన్ని వారం మొత్తం కంట్రోల్ చేసుకో..వారం లో కేవలం శనివారం రోజు మాత్రమే నీ కోపాన్ని చూపించు’ అని అంటుంది. హీరో తన తల్లి చెప్పిన మాటల్ని తూచా తప్పకుండ అనుసరిస్తాడు. అలా అనుసరించడం వల్ల అతని జీవితం లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన స్టోరీ. సరికొత్త కథాంశం తో తెరెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఇక నాని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే అని అనుకోవచ్చు.

- Advertisement -

Nani's 'Saripodhaa Sanivaaram' to kickstart musical promotions

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here