భాష ఏదైనా శరత్ బాబే డబ్బింగ్ చెప్పుకునే వారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, గుప్పెడు మనసు, అభినందన, నోము, మూడు ముళ్ల బంధం, కాంచన గంగ, అగ్నిగుండం, ఇది కథ కాదు, సీతాకోక చిలుక, జీవన పోరాటం, యమకింకరుడు, అమరజీవి, ముత్తు, వంటి ఎన్నో సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర సీరియల్స్ లోనూ శరత్ బాబు నటించారు. ఆయన చివరిసారిగా ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించారు. త్వరలో రిలీజ్ కానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు.

శరత్ బాబు కి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తో పెళ్లి అయ్యింది,14 ఏళ్ళు వీళ్ళు కలిసి దాంపత్య జీవితం గడిపిన తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణం గా విడిపోవాల్సి వచ్చింది. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద, అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమాప్రభ తో విడిపోయిన తర్వాత శరత్ బాబు లతా దీక్షిత్ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఈమెతో కూడా ఎక్కువ కాలం ఆయన దాంపత్య జీవితం కొనసాగించలేదు.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన మూడవ పెళ్లి కూడా చేసుకున్నాడు.

అయితే మూడవ భార్య గురించి ఆయన ఎలాంటి వివరాలు కూడా చెప్పలేదు. కొంతకాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మూడవ భార్య పేరు మిస్సెస్ శరత్ కుమార్ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితె 25 మంది పిల్లలు అని ఆయన జవాబు ఇచ్చారు. తన పిల్లలతో పాటు తన అన్నయ్య, తమ్ముడు మరియు చెల్లెలు పిల్లలు కూడా నా పిల్లలే కదా అంటూ చెప్పుకొచ్చాడు శరత్ బాబు.