Sanjay Dutt : 2015లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బాహుబలి’, ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా రూ.570 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, ఈ చిత్రం ఎండింగ్లో దర్శకుడు రాజమౌళి ఓ క్యూరియాసిటీని నింపి వదిలారు. అభిమానులు దాని సమాధానం తెలుసుకోవాలని రెండేళ్ల పాటు ఉత్సుకతతో ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ‘బాహుబలి 2’లో లభించింది. ఆ సినిమా మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయలను రాబట్టింది. ఆ ప్రశ్న ఏమిటంటే – ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ కట్టప్పకు సంబంధించిన ఈ ప్రశ్న కారణంగా ‘బాహుబలి’ బంపర్ వసూళ్లు సాధించింది.

కట్టప్ప పాత్రను నటుడు సత్యరాజ్ పోషించారు. అయితే ఈ పాత్రకు సత్యరాజ్ మొదటి ఫస్ట్ ఆప్షన్ కాదట. మేకర్స్ మొదట ఈ పాత్ర కోసం సంజయ్ దత్‌ను అనుకున్నారట. 2020 సంవత్సరంలో Rediffలో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ ఎప్పుడూ తన ఎంపిక అని, అయితే కట్టప్ప పాత్ర కోసం సంజయ్ దత్ తన మనసులో ఉన్నాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు.

ఆ సమయంలో సంజయ్ దత్ జైల్లో ఉన్నారని, అందుకే ఆయనను సినిమాలో నటించడం కుదరదని చెప్పాడు. ఆ తర్వాత సత్యరాజ్ ఆ ఐకానిక్ క్యారెక్టర్‌లో నటించాడు. మరి, సినిమా విడుదలైన తర్వాత ఏం జరిగినా, కట్టప్ప పాత్ర అందరి మదిలో ఎలా నిలిచిపోయింది? ఒక ప్రశ్న రెండో భాగానికి ఎలా క్రేజ్ తెచ్చిపెట్టింది? ఈ సినిమా బంపర్ వసూళ్లు ఎలా సాధించింది? ఇదంతా చరిత్రగా మారింది. రెండు చిత్రాలను నిర్మించడానికి మేకర్స్ చాలా డబ్బు ఖర్చు చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ‘బాహుబలి 1’ బడ్జెట్ దాదాపు రూ.180 కోట్లు కాగా ‘బాహుబలి 2′ బడ్జెట్ దాదాపు రూ.250 కోట్లు.