డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ మరో సారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే షూటింగ్ ను గ్రాండ్ గా ముంబైలో స్టార్ట్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో నటించనున్న యాక్టర్లను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. తొలుత షూటింగ్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నటులను ఫైనల్ చేయాలనేది పూరి ప్రణాళిక. ఇదిలా ఉంటే సినిమాలో రామ్ సరసన ఆడిపాడే హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పటికే చాలా పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర నిమిత్తం బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ సినిమా కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ కూడా అడిగారట. అందుకు పూరి ఛార్మి కూడా ఓకే అన్నట్లు సమాచారం.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారికంగా క్లారిటీ రానున్నట్లు సమాచారం. బాలీవుడ్ మున్నా భాయ్ సంజయ్ దత్ 25 ఏళ్ల క్రితం నాగార్జున చంద్రలేఖ
సినిమాలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు రామ్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 24న విడుదల కానున్నట్లు ప్రారంభోత్సం రోజే యూనిట్ అనౌన్స్ చేసింది.