Sania Mirza : ఫ్యాన్స్ కు బిగ్ షాక్..ఆ స్టార్ హీరో సినిమాలో సానియా మీర్జా ఐటెం సాంగ్ ?

- Advertisement -

Sania Mirza : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక కొడుకు పుట్టిన తర్వాత డివోర్స్ తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక షోయబ్ మాలిక్‌ మరో పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ సానియా మీర్జా మాత్రం రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఇక డివోర్స్ తర్వాత సానియాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జా ఒక సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టింది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనకు బాలీవుడ్ స్టార్ హీరో ఐటమ్ సాంగ్ లో నటించే ఆఫర్ ఇచ్చాడన్న విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌, సానియా మంచి స్నేహితులు. ఫరా ఖాన్ బ్రదర్ సానియా మీర్జాకు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమంటూ కోరాడట. కానీ సున్నితంగా ఆ ఆఫర్ ని సానియా మీర్జా రిజెక్ట్ చేసిందట. ఇదే విషయాన్ని చాలా కాలం తర్వాత బయటపెట్టింది . దీంతో సానియా మీర్జా పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తాను క్రీడాకారిణి కాకపోయి ఉంటే ఇండస్ట్రీలో పని చేసేదాన్ని అంటూ తెలిపింది.

- Advertisement -

అంతేకాకుండా సానియా మీర్జా బయోపిక్ తెరకెక్కిస్తే ఏ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని అడుగగా.. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ నటిస్తే నేనే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సానియా మీర్జా కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సానియా మీర్జా త్వరలోనే స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఆయనతో ఉన్న ఎఫైర్ కారణంగానే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందంటూ కూడా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here