Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇటీవలే విడిపోయారు. సానియా మీర్జా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైంది. ఆమె బాక్సర్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, షార్ప్ షూటర్ సిఫ్త్ కౌర్‌తో కలిసి ఈ షోకు హాజరైంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
షో హోస్ట్ కపిల్ శర్మ.. సానియా మీర్జాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించింది. మరి మీ బయోపిక్ సంగతేంటి అని అడిగారు. అందుకు సానియా మీర్జా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి నటీనటులు ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్ శర్మ.. నువ్వు ప్రేమించే వ్యక్తి పాత్రలో చేయాలని ఉందని గతంలో షారుక్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.
అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అంటూ ఆన్సర్ ఇచ్చింది. షారుక్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సానియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ డివోర్స్ తీసుకున్నారు. అనంతరం షోయబ్ పాకిస్తాన్ హీరోయిన్ సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.