Sania mirza : ఆ తెలుగు హీరోతో సంబంధం ఉండడం వల్లే సానియా మీర్జా కి విడాకులు అయ్యిందా..?

- Advertisement -

Sania Mirza : టెన్నిస్ రంగం లో దిగ్గజం లాగ రాణించిన సానియా మీర్జా అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోహెబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంఘటన అప్పట్లో పెను దుమారమే రేపింది. పాకిస్తాన్ కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ సానియా మీర్జా ని బాండ బూతులు తిట్టారు ఫ్యాన్స్. అయితే అవేమి పట్టించుకోలేదు సానియా మీర్జా. అతనితో కొంత కాలం కలిసి దాంపత్య జీవితం సుఖంగానే గడిపింది, ఒక కొడుకు జన్మని కూడా ఇచ్చింది.

కానీ సోహెబ్ తనకు తెలియకుండా సనా జావేద్ అనే పాకిస్థానీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసినప్పటి నుండి అతనితో గొడవలు పెట్టుకోవడం మొదలెట్టింది. అలా కొంతకాలం దూరం గా ఉంటూ వచ్చిన సానియా మీర్జా భర్త కి విడాకులు ఇచ్చింది అంటూ సోషల్ మీడియా లో గత కొంతకాలం నుండి ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది. ఇది రూమరా? లేకపోతే నిజంగానే వీళ్లిద్దరు విడిపోయారా అనేది అభిమానులకు కూడా అర్థం కాలేదు.

కానీ రీసెంట్ గా సోహెబ్ మాలిక్ సనా జావేద్ ని పెళ్లాడుతూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూసిన తర్వాత అందరికీ వీళ్లిద్దరు విడిపోయారు అనే క్లారిటీ వచ్చింది. దీంతో కొంతమంది అభిమానులు బాధపడగా, మరికొంతమంది మాత్రం పాకిస్థాన్ కుర్రాడిని చేసుకున్నందుకు తగిన శాస్తి జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సానియా మీర్జా గురించి సోషల్ మీడియాలో మరో రూమర్ కూడా ప్రచారం లో ఉంది.

- Advertisement -

సానియా కి ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రముఖులందరూ తెలుసు. మన టాలీవుడ్ హీరోలతో కూడా ఆమెకి మంచి సంబంధం ఉంది. అయితే ఆమె ఒక తెలుగు హీరోతో నడిపిన ఎఫైర్ కారణంగానే సోహెబ్ మాలిక్ ఆమెకి విడాకులు ఇచ్చాడని, లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మరి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ రూమర్స్ ఏది నిజమో తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here