Sandeep Vanga : మూవీ హిట్టైతే చాలు డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ గిఫ్ట్ లు ఇవ్వడం ఈ మధ్య మామూలైపోయింది. చిన్న చిత్రాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిస్తే ప్రొడ్యూసర్ల నుంచి యూనిట్ మెంబర్లకు గిఫ్ట్ లు ఇవ్వడం చూశాం. విజయాలను బట్టి లక్షలు, కోట్ల రూపాయల వరకు కార్లు కొనిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పటి వరకు గిప్ట్ లు ఇచ్చిన నిర్మాతలందరూ తమ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయి భారీగా లాభాలు వచ్చాకే దర్శకులకు గిఫ్ట్ లు ఇచ్చారు. కానీ యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మూవీ రిలీజ్ కు ముందే బహుమతి ఇచ్చేశాడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. అంటే ప్రీ రిలీజ్ బహుమతి అన్నట్లు.
యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాకు ప్రొడ్యూసర్ రూ.5 కోట్ల విలువైన కారుని గిఫ్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అంటుంటే.. మరికొందరు డైరెక్టర్ పై ప్రొడ్యూసర్ కు ఉన్న నమ్మకం అంటున్నారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాతో డైరెక్టర్ గా దేశవ్యాప్తంగా ఓ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు సందీప్ వంగా.

రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ తో యానిమల్ మూవీని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ క్రేజ్ తో హిందీ సహా అన్ని భాషల్లో యానిమల్ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కు భారీగా లాభాలు దక్కబోతున్నట్లు బీ టౌన్ లో టాక్.
తనకు భారీ హిట్ ఇవ్వబోతున్న డైరెక్టర్ సందీప్ కు నిర్మాత భూషణ్ కుమార్ రూ.5 కోట్ల విలువనై కారు గిఫ్ట్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లకు గిఫ్ట్ లు ఇచ్చారు. కానీ సందీప్ కు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదైందిగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రీ రిలీజ్ గిఫ్ట్ తో డైరెక్టర్ సందీప్ చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ను మూవీపై నమ్మకంతో ఇచ్చాడా లేదా మూవీ పబ్లిసిటీ స్టంటా అని కొందరు నిర్మాతను ప్రశ్నిస్తున్నారు.