Rashmika Mandanna : డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ‘యానిమల్’. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ మేకింగ్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. మరో రెండు వారాలపాటు నార్త్ ఆడియన్స్ ఈ మూవీ ఫీవర్ నుంచి బయటికి రాకపోవచ్చునే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

చాలాకాలం తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది రష్మిక. ఈమధ్య గ్లామర్ రోల్స్ లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మకి ‘యానిమల్’ మూవీలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ దక్కడంతో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సినిమాలో రణబీర్ నటనతో పాటు రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే ‘యానిమల్” మూవీలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్రకి ముందుగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాని సెలెక్ట్ చేశారట. ఆమెతో అగ్రిమెంట్ కూడా అయిపోయిందట. కానీ ఆ పాత్రకి పరిణితి లుక్స్, పెర్ఫార్మెన్స్ సెట్ కాకపోవడంతో ఆమెను తప్పించాల్సి వచ్చిందని సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

” నిజానికి పరిణితి చోప్రా పెర్ఫార్మన్స్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆమె యాక్టింగ్ చూసి యానిమల్ మూవీకి సెలెక్ట్ చేశాను. ఆడిషన్స్, రెండు, మూడు స్క్రీన్ టెస్టులు చేసిన తర్వాత కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో ఆమె నుంచి పర్ఫామెన్స్ రాలేదు. దాంతో గీతాంజలి పాత్రకి ఆమె సెట్ అవ్వదని అర్థమైంది. దీంతో ఆమెకు సారీ చెప్పి రష్మిక కి స్క్రీన్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది” అంటూ సందీప్ రెడ్డి వంగ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా ‘యానిమల్’ మూవీలో హీరోయిన్ పాత్రకి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా స్థానంలో రష్మిక సెలెక్ట్ అయి తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.