Big Boss : డేంజర్ జోన్ లో సందీప్ – శోభా..ఈ వారం డబుల్ బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్?

- Advertisement -

Big Boss : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం ఎంత వాడివేడి వాతావరణం మధ్య సాగిందో మనమంతా చూసాము. వాదనలు ప్రతివాదనలు నడుమ బిగ్ బాస్ హౌస్ మంటెక్కిపోయింది. ఇకపోతే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రతీ కంటెస్టెంట్ నామినేషన్ ని ఎదురుకున్నాడు కానీ. సందీప్ మాత్రం ఒక్కటంటే ఒక్క నామినేషన్ ని చూడలేదు. మొదటి వారంలోనే పవర్ అస్త్ర ని గెలుచుకొని 5 వారాలు నామినేషన్స్ తప్పించుకున్నాడు.

Big Boss
Big Boss

ఇదే సందీప్ కి పెద్ద మైనస్ అయ్యింది. నామినేషన్స్ కి వస్తూ ఉంటె ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఓటింగ్స్ ప్రతీ వారం ఆట తీరుని బట్టి పెరగడంతో, తగ్గడంతో జరుగుతూ ఉంటాయి. కానీ సందీప్ కి అది జరగలేదు. అలాగే హౌస్ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడడం కూడా అతనికి మైనస్ అయ్యింది. 5 వారాలు నామినేషన్స్ తప్పించుకున్న సందీప్, ఆరవ వారం, 7 వ వారం కూడా నామినేషన్స్ తప్పించుకున్నాడు.

కానీ 8 వ వారం లో మాత్రం సందీప్ కి నామినేషన్స్ పడ్డాయి. ముందుగా అతనిని యావర్ నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత తేజా నామినేషన్ తో అధికారికంగా నామినేట్ అయ్యాడు. ఇకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే సందీప్ కి అందరికంటే అత్యంత తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. ఆయన తర్వాత అతి తక్కువ ఓట్లను సంపాదించుకున్న కంటెస్టెంట్ శోభా శెట్టి.

- Advertisement -

వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అయితే బిగ్ బాస్ ప్రారంభమై 50 రోజులు పూర్తి అయ్యింది. హౌస్ లో ఇంకా 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. అదే కనుక జరిగితే ఈ ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వక తప్పదు. వీళ్ళు ఎలిమినేట్ అయితే శివాజీ బ్యాచ్ మొత్తం పండగ చేసుకుంటారు అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుందో అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here