Sandeep Kishan : టాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ కూడా కాలం, అదృష్టం కలిసిరాక కనీస స్థాయిలో కూడా మార్కెట్ ని సంపాదించుకోలేకపోయిన హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు సందీప్ కిషన్. ఈయన శర్వానంద్ హీరో గా నటించిన ‘ప్రస్థానం’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.
ఈ కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది, భవిష్యత్తులో పైకి వస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ఆ సినిమానే ఆయన చివరి హిట్ గా కూడా మిగిలిపోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇది కచ్చితంగా అయాన్ స్క్రిప్ట్ సెలక్షన్ లోపం వల్లే అని చెప్పొచ్చు. అలా చేస్తున్న ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన సినిమాల్లో హీరో గా కొనసాగుతూనే ఉన్నాడు.
ఇదంతా పక్కన పెడితే సందీప్ కిషన్ అప్పట్లో ‘నగరం’ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది కానీ, క్రిటిక్స్ ఫేవరెట్ మూవీ గా మాత్రం నిల్చింది. ఈ చిత్రం ద్వారానే ఇప్పుడు సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్స్ లో ఒకడైన లోకేష్ కనకరాజ్ పరిచయం అయ్యాడు. అతనికి అవకాశాలు ఎవ్వరూ ఇవ్వని సమయం లో సందీప్ కిషన్ గుర్తించి లోకేష్ కి అవకాశం ఇచ్చాడు. ఆ కృతజ్ఞతా ఇప్పటికీ లోకేష్ లో ఉంటుంది. లోకేష్ కనకరాజ్ వల్ల ఎంతో మంది హీరోల కెరీర్స్ బాగుపడ్డాయి. ఉదాహరణకి వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న కార్తీకి ‘ఖైదీ’ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు.
ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కార్తీకి రాలేదు. ఇక తర్వాత మార్కెట్ మొత్తం పూర్తిగా కోల్పోయిన కమల్ హాసన్ కి ‘విక్రమ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చి ఊపిరి పోసాడు. ఇక తమిళ హీరో విజయ్ కి ‘మాస్టర్’ సినిమా ద్వారా తెలుగు లో కూడా మంచి మార్కెట్ వచ్చేలా చేసాడు. సందీప్ కిషన్ లోకేష్ కి అవకాశం ఇవ్వకపోయ్యుంటే ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చేవా?, ఆ హీరోల కెరీర్ టర్న్ అయ్యేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.