Actress Sana Begum బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సీరియల్లో మాత్రమే కాకుండా మరోవైపు వెండితెర పై కూడా అనేక సినిమాలలో నటించిన నటిమని సనా బేగం. ఎన్నో వందల సినిమాల్లో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆమె తాను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందో అని కెరియర్ మొదట్లోనే హీరోయిన్ ఛాన్స్ వచ్చిన ఆవిడ తిరస్కరించింది. దానితో కేవలం సహాయక నటి పాత్రలోని ఆమె నటిస్తూ వచ్చింది.
వెండితెరపై ఆమెకి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు ఉంది. ఈవిడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. కాకపోతే తాజాగా గత 5 రోజుల నుంచి ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఫాలోవర్స్ కాస్త కంగారు పడిపోయారు. దాంతో ఆవిడకు కొన్ని వందల మెసేజ్లు వచ్చాయట. అసలు ఏమైంది..? లేకపోతే రంజాన్ పండుగ సందర్భంగా బిజీగా ఉన్నారా? అంటూ అనేక మెసేజ్లు వచ్చాయని తెలిపింది. అయితే తాను సోషల్ మీడియాకు చిన్న బ్రేక్ ఇవ్వడానికి గల కారణాన్ని బయట పెట్టింది సనా.
ఇకపోతే అసలు విషయం చూస్తే. ముందుగా క్షమాపనులు తెలుపుతూ సన భర్తకు తాజాగా గుండెపోటు రావడం జరిగింది. దాంతో అతనిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. తనకి అల్లా దయవల్ల సర్జరీ విజయవంతంగా జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ తెలిపింది. నాతోపాటు మీ అందరి ఆదర అభిమానులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక దీనిపై ఆవిడ ఫాలోయర్స్ ఆవిడ భర్త త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.