వరస సినిమాలతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది సంయుక్త మీనన్. ఈమె గురించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాట్లాడకుంటున్నారు. ఎప్పుడైతే ఈ హీరోయిన్ భీమ్లా నాయక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత ఈమె దశ తిరిగిపోయింది. అయితే ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ ఆ తర్వాత బింబిసారా, సార్,విరూపాక్ష వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకొని లక్కీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.

తాను స్క్రీన్ టెస్ట్ లో అన్ని హావ భావాలను పలికిస్తానంది. ఎమోషన్, జాలి,కరుణ, దయ,ఏడవడం, నవ్వడం,శృంగారం రసం ఇలా ప్రతి ఒక్క దాన్ని నేను చూపిస్తుందట. అయితే తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత మంది తన కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయని విమర్శించేవారట. కానీ ప్రస్తుతం ఆ కళ్ళతోనే హావ భావాలను పలికిస్తున్నావు నీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకుంటున్నారు. అంటూ సంయుక్త మీనన్ (Samyuktha Menon) ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అలాగే, సంయుక్త మీనన్ గురించి ఇంకా వివరిస్తూ.. టీనేజర్‌గా నా ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండేవి. ఒకసారి బాగా చదువు కోవాలని ఉండేది, ఇంకోసారి ఇంకో అంశం మీదకు దృష్టి మళ్లేది. కానీ ఇరవై దాటి పాతికేళ్లకు వచ్చేసరికి స్థిరంగా ఉండటం అలవాటైంది. దాంతో సినిమాలమీద శ్రద్ధ పెట్టగలిగా. అభిమానులూ, శ్రేయోభిలాషులూ చూపించే ప్రేమాభిమానాలు ఇక్కడ చాలా ఎక్కువ.
వాళ్లకు వ్యక్తిగతంగా తెలియకపోయినా… పుట్టినరోజున లక్షల మంది విష్ చేస్తారు. సినిమా ప్రయాణంలో నాకు ఇంకో గొప్ప అంశం అనుభవమవుతుంది… అదే అహాన్ని వీడటం. ఒక పాత్రలో లీనమైపోతే నన్ను నేను మర్చిపోతా. దానివల్ల కొన్ని రోజులపాటు అహాన్ని నానుంచి దూరం చేసుకోగలుగుతా. నాకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఆ విధంగా ఇది నాకు సంతృప్తినిచ్చే అంశం.