Samyuktha Menon : ఈ భామ సోషల్ మీడియాలో మరోసారి తన క్రేజ్ చూపించింది. చీరకట్టులో తన అందంతో మాయ చేసింది. గ్రీన్ కలర్ శారీలో తేనె కళ్ల చూపుతో కట్టిపడేసింది. కాస్త క్లీవేజ్ షో చేస్తూ గ్లామర్ టచ్ ఇచ్చింది. ఓర చూపుతో మైమరిపించింది. ప్రస్తుతం సంయుక్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంయుక్త లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ తేనె కళ్లు బ్యూటీఫుల్ గా ఉన్నాయంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ భామ చీరకట్టులో మరింత ముద్దొస్తుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గార్జియస్ అంటూ లవ్ ఎమోజీస్ తో ప్రేమను నింపేస్తున్నారు. మొత్తానికి సంయుక్త లేటేస్ట్ ఫొటోస్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇక సంయుక్త సినిమాల సంగతికి వస్తే ఈ భామ భీమ్లా నాయక్ సినిమాలో రానాతో కలిసి నటించింది. ఆ సినిమా ఈవెంట్ లో పవన్ కల్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడి తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచేసుకుంది. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ విరూపాక్షి చిత్రంలో చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో సంయుక్త యాక్టింగ్ వేరే లెవెల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలా టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో సంయుక్త తన అందం, అభినయంతో తన మార్క్ చూపించింది.