Samyuktha Menon : ప్రస్తుతం హీరోయిన్ సంయుక్త చేసిన పనికి ఇండస్ట్రీ అంతా ఫిదా అవుతోంది. విరూపాక్ష సూపర్ హిట్ అయ్యాక ఈ టీమ్ ఓ ప్రముఖ షోకు గెస్ట్ లుగా వెళ్లారు. అక్కడ సంయుక్త తన తెలివితో ఏకంగా ఒక స్కూటీనే గెలుచుకుంది. కానీ ఆ స్కూటీని ఆమె తీసుకోకుండా కాలేజీ ఆడపిల్లలకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక్కడ విశేషమేమింటంటే.. ఆ స్కూటీ ఇచ్చే ముందు సంయుక్త అడిగిన ప్రశ్నలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ షోకు హాజరైన వారిలో కొందరిని ఎంపిక చేసి దానిని అందజేసింది.

వారిలో ఎవరెవరు రోజూ కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్తారని అడగ్గా.. చాలామంది చేతులెత్తారు. అలా ఎత్తిన వారిలో సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్లు ఎంతమంది అని అడిగింది. వారిలో నుంచి ఇద్దరు అమ్మాయిలు వారికి తండ్రిలేరని చెప్పారు. వెంటనే సంయుక్త తాను గెలుచుకున్న స్కూటీని వారిలో ఒక అమ్మాయికి ఇచ్చింది. మరో అమ్మాయికి తానే స్వయంగా కొనిస్తానని హామీ ఇచ్చింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది. సంయుక్త మంచి మనసు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉంటారు కానీ, సంయుక్త లాంటి మనసున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారంటూ పొగుడుతున్నారు.

అయితే సంయుక్త ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది. ఆమెకు చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గరే ఉంటుంది. తన తండ్రి ఇంటిపేరును కూడా తీసేసింది. సంయుక్త తల్లి.. తండ్రి నుంచి విడిపోయిందని, కాబట్టి ఆమెకు భర్త కుటుంబానికి చెందిన ‘మీనన్’ ఇంటి పేరును కొనసాగించడం ఇష్టం లేదని తీసేసింది. తన తల్లి కోరికను గౌరవిస్తూ సంయుక్త ఇంటి పేరును తొలగించుకుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తర్వాత ‘సార్’ ( Sir ) తో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మెగా హీరో సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’ ( Virupaksha ) కూడా అంచనాలకు మించి విజయం సాధించడంతో ఈ అమ్మడి ఆనందానికి హద్దులు లేవు.