Samyukta Menon : ఫీలింగ్స్‌ను తట్టుకోలేకపోతున్నానంటూ అలాంటి ఫోటోలతో పోస్ట్ పెట్టిన సంయుక్తా మీనన్

- Advertisement -

Samyukta Menon : యంగ్ హీరోయిన్ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. దీంతో సంయుక్తా మీనన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ బ్యూటీ నటించిన బింబిసార, సార్, విరూపాక్ష వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. తెలుగు, మలయాళం, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‍లో ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బిజీబిజీగా చిత్రాలు చేస్తున్నారు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మలయాళ భామ మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. అయితే సంయుక్తా మీనన్‌ ఎందుకో గానీ ఆఫర్లు వస్తున్నా అన్నింటికి రిజెక్ట్ చేస్తుందట. తన నచ్చిన పాత్ర కోసం వెయిట్ చేస్తుందట.

ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు రెడీ అయిందట. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మహారాగ్ని మూవీలో ఓ ప్రధాన పాత్రలో ఆమె నటిస్తున్నారు. ‘స్పై’ సినిమా ఫేమ్ చరణ్ తేజ్ ఉప్పాలపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ తేజ్‍ కూడా ఈ మూవీతోనే బాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్నారు. ఇక, 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మళ్లీ జత కడుతున్నారు. ఈ సినిమా గ్లింప్స్ మే 28న విడుదల అయింది.

- Advertisement -

 

 

సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సంయుక్తా మీనన్ గ్రీన్ కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి ఆసక్తికరమైన కొటేషన్ షేర్ చేసింది. ‘‘భావాలు అలల వంటివి. అవి రాకుండా అదుపు చేయలేం. కానీ వాటిలో దేనిని తుడిచేయాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు సేమ్ సమంతలాగా ఉన్నావంటూ కామంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here