Samantha : పూజా హెగ్డే కెరీర్ ని కాపాడడం కోసం సమంత సంచలన నిర్ణయం..ఇలాంటి త్యాగాలు ఎవ్వరూ చేసుండరు!

- Advertisement -

Samantha : నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయిన పూజా హెగ్డే ఇప్పుడు అకస్మాత్తుగా ఏ సినిమాలో కూడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏమైంది పూజ హెగ్డేకి?, శ్రీలీల మేనియా లో ఆమె కూడా కొట్టుకుపోయిందా?,లేకపోతే బాలీవుడ్ లో అవకాశాలు రావడం తో టాలీవుడ్ ని వదిలేసిందా?, ఇలా ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Samantha
Samantha

అయితే ఇప్పుడు సమంత కారణం గా పూజా హెగ్డే కి టాలీవుడ్ లో మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతుంది. సమంత రీసెంట్ గానే మయోసిటిస్ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ల సూచన మేరకు ఆమె సంవత్సరం పాటు సినిమాలకు దూరం గా ఉంటూ బాగా రెస్ట్ తీసుకోవాలి. అందుకే అంతకు ముందు సంతకం చేసిన సినిమాలకు అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తుంది.

అలా ఆమె తప్పుకుంటున్న సినిమాల్లోకి పూజ హెగ్డే ని తీసుకుంటున్నారు మేకర్స్. ఉదాహరణకి నందిని రెడ్డి మరియు సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలి అని స్పష్టం గా చెప్పడం తో ఈ చిత్రం నుండి ఆమె తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానం లోకి పూజా హెగ్డే వచ్చింది అట.

- Advertisement -

ఇలా సమంత ఒప్పుకున్న రెండు మూడు ప్రాజెక్టులు పూజా హెగ్డే చేతికి వెళ్లాయట. ఇండస్ట్రీ లో మొదటి నుండి సమంత మరియు పూజా హెగ్డే మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఇప్పుడు సమంత ప్రాజెక్ట్స్ అన్నీ పూజా కి షిఫ్ట్ అవుతూ ఉండడం తో పరోక్షంగా సమంత పూజ కెరీర్ కి సహాయపడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here