సమంత : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం సమంత రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చిన ఈమె, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, తనకి ప్రాధాన్యం ఉన్న ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అయిపోతుంది..

అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ లో ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఇందులో ఆమె విలన్ గా నటించి బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది సమంత .ఇప్పుడు ఆ సిరీస్ మేకర్స్ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇది ఇలా ఉండగా సమంత ఇటీవలే ‘పెప్సీ’ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ బ్రాండ్ కి ఇప్పటి వరకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు మాత్రమే చేసారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ ‘పెప్సీ’ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచెయ్యడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఈ యాడ్ లో నటించినందుకు గాను ఆమె అక్షరాలా మూడు కోట్ల రూపాయిలు తీసుకుందట.

ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం, ఆమె ప్రధాన పాత్ర పోషించిన రీసెంట్ చిత్రం ‘యశోద’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, ఆమె బ్రాండ్ ఇమేజి ఇసుమంత కూడా తగ్గలేదంటే, సమంత క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజ్ బాగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు, రాబొయ్యే రోజుల్లో ఆమె ఇంకా ఎంత పీక్ స్థానానికి చేరుకుంటుందో చూడాలి.