Samantha : కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకు పోతుంది సమంత. చైతుతో విడాకుల తర్వాత ఫుల్ ఫోకస్ కెరీర్ పైనే పెట్టింది. అలానే వరుస సినిమాలను సైన్ చేసి నటిస్తోంది. సమంతకు మయోసైటిస్ వ్యాధి భారిన పడి దాని కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈమె కాస్త కోలుకున్న సమయంలో తను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తి చేసింది. అనారోగ్యం కారణంగా సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించింది. దీంతో పూర్తి దృష్టి ఆరోగ్యంపై కేంద్రీకరించింది.

ఈ ఏడాది గ్యాప్ లో సమంత వ్యాధి నయం చేయించుకునేందుకు త్వరలోనే అమెరికా వెళ్ళబోతుంది సమంత. అమెరికా వెళ్లేలోపు ఈమె పలు ప్రదేశాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉంది. టూర్లో సందర్శించిన పలు ప్రదేశాల గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. సమంత అమెరికా వెళ్తున్న తరుణంలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వ్యాధి ట్రీట్ మెంట్ కోసం భారీగా ఖర్చవుతుందట. అందుకు సమంత ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో వద్ద ఏకంగా రూ.25కోట్లు అప్పు చేసిందట. దీంతో నెటిజన్స్ ఇన్ని హిట్ సినిమాల్లో నటించిన సమంతకు అన్ని డబ్బులు లేవా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఏంటో త్వరలోనే తెలుస్తుంది.
