Samantha : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత మొదటి స్థానం లో ఉంటుంది. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన సమంత ఆ తర్వాత తెలుగు మరియు తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో కవర్ చేసిన హీరోయిన్ గా నిల్చింది. అలా నిత్యం బిజీ గా ఉండే సమంత మయోసిటిస్ వ్యాధి సోకడం తో చాలా అవకాశాలను కోల్పోతుంది.
దీనికి పూర్తి స్థాయిలో ఆమె చికిత్స తీసుకున్నా కూడా ఒక ఏడాది పాటు కచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తో సమంత విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆమె రెండవ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే దానిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. దీనిపై సమంత ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు.
లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే సమంత పెళ్లి లేకుండానే ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలని అనుకుంటుందట. అంటే కృతిమంగా అన్నమాట. ఈ విషయం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది. అంటే దీనర్థం ఆమె ఇక రెండవ పెళ్లి చేసుకోబోదు, కానీ బిడ్డకి మాత్రం తల్లి కావాలి అనుకుంటుంది అని. మరో వార్త ఏమిటంటే ఈ ప్రక్రియ సమంత ఇప్పటికే ప్రారంభించేసిందని, ఆమె ఇప్పుడు గర్భం దాల్చింది అంటూ వార్తలు వినిపిస్తుంది.
అందుకే ఆమె ఏడాది పాటు సినిమాల్లో నటించడానికి బ్రేక్ ఇచ్చిందని కూడా అంటున్నారు. మరి సోషల్ మీడియా లో ప్రతీ విషయం పై స్పందించే అలవాటు ఉన్న సమంత దీని మీద రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. ఇకపోతే సమంత ప్రధాన పాత్ర లో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.