అమెరికాలో కొత్త ఇల్లు కొనుకున్న సమంత.. ధర తెలిస్తే కంగు తినాల్సిందే..!

- Advertisement -

“ఏం మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. కాలం కలిసి రాకపోవడంతో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడం.. తను మయోసైటిస్ బారిన పడడం ఒకే సారి జరిగింది. ఈ క్రమంలోనే తాను ఒప్పుకున్న సినిమా ఖుషి సినిమా పూర్తి చేసింది. మయోసైటిస్ కారణంగా కొన్ని రోజులు సినిమాలకు విరామం ప్రకటించి తన అభిమానులను నిరాశకు గురిచేసింది.

సమంత
సమంత

ప్రస్తుతం తాను ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ పెట్టింది. ఈ వ్యాధి చికిత్స నిమిత్తం ఇటీవలే ఆమె అమెరికాకి వెళ్లింది. మయోసైటిస్ చికిత్స నిమిత్తం సమంత కొన్ని నెలల పాటు అమెరికాలోనే ఉండాల్సింది ఉంది. అందువల్ల తాను ఒప్పుకుని అడ్వాన్స్ తీసుకున్న సినిమాలను సైతం వదులుకుంది. సినిమాలు చేసేందుకు తీసుకున్న అడ్వాన్స్ లను వెనక్కి ఇచ్చేసింది.

Samantha

రాబోయే మూడు నెలలపాటు సమంత ట్రీట్ మెంట్ తీసుకోనుందట. అందువల్లే ఖుషి ప్రమోషన్స్‌కు కూడా వెళ్లే అవకాశం లేదు. కాబట్టి సినిమా ప్రమోషన్స్ బాధ్యతంతా విజయ్ ఒక్కడే తన భుజాలపై వేసుకున్నాడు. విజయ్ సమంత కలిసి మ్యూజిక్ ఈవెంట్ లోనే సినిమాకు కావాల్సినంత హైప్‌ని తీసుకొచ్చారు. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ డ్యాన్స్ సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లాల్సి ఉండేది సమంత. కానీ అక్కడకి వెళ్లలేక పోయింది.

- Advertisement -

న్యూయార్క్ లోనే దాదాపు 3నెలలపాటు ఉండి మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో సమంత ఆ సమయంలో సమంత పోస్ట్‌లు పెట్టడం తప్పితే ఏ ఈవెంట్ లోను పాల్గొనే అవకాశం లేదు. ఇక మూడు నెలల పాటు ఎటువంటి ఎంజాయ్ మెంట్ ఉండదని.. ముందే తన స్నేహితులతో కలిసి బాలి వెళ్లి ఎంజాయ్ చేసింది ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే సమంత అమెరికాలోనే.. ఓ పెద్ద ఫ్లాట్ తీసుకుందట.. దాని ధర ఏకంగా రూ.20కోట్లని సమాచారం. చికిత్స కోసం అమెరికా వెళ్ళిన‌ సమంత అందులో భాగంగానే అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com