Samantha : యంగ్ హీరోల్లో నితిన్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘జయం’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్, ఆ తర్వాత వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో త్రివిక్రమ్, రాజమౌళి, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ ఇలా అందరి స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసిన అతి తక్కువమందిలో ఒకరు నితిన్. అయితే ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం చేతకాక వరుసగా 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో మార్కెట్ మొత్తం జీరో అయిపోయింది. ఒకానొక సందర్భంలో నితిన్ కి సినిమాలు షూటింగ్ పూర్తి అయ్యి ల్యాబ్స్ నుండి బయటకి రాని రోజులు కూడా ఉన్నాయి.
అలాంటి రోజుల నుండి ఆయన ‘ఇష్క్’ చిత్రం తో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి పడ్డాడు. ఈ సినిమా తర్వాత ఆయనకీ వరుసగా హిట్స్ వచ్చాయి, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని మరోసారి ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. అయితే నితిన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన ‘అఆ’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమాలో సమంత కి ఉన్నంత ప్రాధాన్యత నితిన్ కి ఉండదు. సినిమా హిట్ అయ్యాక ఎక్కువ మంచిపేరు కూడా సమంతకే వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నితిన్ సమంత తో చాలా సరదాగా ఉండేవాడు. ఆమె మీద ఎన్నో సందర్భాలలో జోకులు కూడా పేల్చాడట. అయితే ఒకరోజు సమంత సరైన మూడ్ లో లేదు. ఆరోజు నితిన్ ఆమె మీద చేసిన సరదా కామెంట్స్ ని తీసుకోలేకపోయింది.
దీంతో కోపంతో ఊగిపోయిన సమంత ‘నీ హద్దులు నువ్వు దాటకు..నోరు అదుపులో పెట్టుకో..ఇంకోసారి నాపై ఇలాంటి కామెంట్స్ చేస్తే మర్యాదగా ఉండదు’ అని నితిన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఎప్పుడూ సరదాగా ఉండే సమంతలో ఇంతకోపం ఉందా అని నితిన్ కూడా ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత రోజు నుండి నితిన్ సమంత తో మాట్లాడడం బాగా తగ్గించేసాడట. దీనికి ఎంతో బాధపడిన సమంత ఒక రోజు నితిన్ వద్దకు వెళ్లి అతనికి క్షమాపణలు చెప్పి మళ్ళీ ప్యాచప్ చేసుకుందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.