టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్న మాట నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆమె ఏడాది పాటు గ్యాప్ తీసుకుంటుందట. సమంత మయోసైటిస్‌తో బాధపడుతోందన్న సంగతి తెలిసిందే. దీంతో సమంత ఇంకో ఏడాది పాటు హెల్త్ మీదే తన పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాలని అనుకుంటుందట. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాగ చైతన్య తో విడాకుల తర్వాత తన దృష్టంతా సినిమాలపైనే పెట్టింది. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇప్పటికే తెలుగులో ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ రెండింటి తర్వాత సమంత ఇప్పట్లో మరే ప్రాజెక్ట్‌లకు కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకుందట. ఇప్పట్లో తెలుగు, హిందీ, హాలీవుడ్ చిత్రాలేవీ అంగీకరించకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో కొన్ని సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను కూడా తిరిగి ఇచ్చేసిందని సమాచారం. ఇప్పుడు ఆమె తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అవసరమైన చికిత్సలు చేయించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే.. కాస్త ఇబ్బంది పడుతున్న సమంత ఆరోగ్యం కంటే మరేమీ ముఖ్యం కాదని, ఆమె త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నామని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ విషయాన్ని సమంత అధికారికంగా అభిమానులకు ఎప్పుడు చెబుతుందేమో చూడాలి.