మళ్లీ ప్రేమ పాఠాలు మొదలు పెట్టిన సమంత…..

- Advertisement -

Samantha : కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ఫ్రెండ్స్ తో టూర్ ఎంజాయ్ చేస్తుంది. బాలి ఐలాండ్స్ లో నేచర్ బ్యూటీ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమంత పెట్టే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ కెరియర్ లో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత.యశోద మూవీ తర్వాత కాస్త హెల్త్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేసిన సామ్ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి సంవత్సరం పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.

Samantha
Samantha

ఈ హాలిడే తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆమె అమెరికాకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ వన్ ఇయర్ బ్రేక్ టైం లో సమంత తన పూర్తి ఫోకస్ అంతా హెల్త్ పైనే పెట్టనుంది. ఈ నేపథ్యంలో యోగా సెంటర్స్ ,టెంపుల్స్ ,టూర్స్ ప్లాన్ చేసుకొని కంప్లీట్ గా రిలాక్స్ అవుతూ టైం స్పెండ్ చేయబోతుంది.వెకేషన్ జరుపుకుంటున్న సమంత ఎప్పటికప్పుడు ట్రెండీగా డ్రెస్సెస్ వేసుకొని పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సమంత పెట్టిన ఒక పోస్ట్ ఆమె తిరిగి మళ్లీ లవ్ లో పడిందా అన్న అనుమానాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా సమంత పెట్టిన ఓ పిక్ లో లవ్ కి సంబంధించిన యాంగిల్ ఉంది అని అందరూ భావిస్తున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అంటే…”కొన్ని సందర్భాలలో మనం కేవలం ఎక్కువగా ద్వేషం గురించే వింటాం. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన ఊహ కు మించి ప్రేమ దాగి ఉంది.”అని సామ్ పోస్ట్ చేసింది.దీంతో సమంత మళ్ళీ లవ్ లో పడిందేమో అన్న అనుమానాలు సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి.

- Advertisement -

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దీంతోపాటుగా సమంత బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో నటించిన ‘సిటడెల్’వెబ్ సిరీస్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇవి రెండు అనుకున్న సక్సెస్ సాధిస్తే తిరిగి సమంత తన క్రేజ్ పొందే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here