Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సినిమా ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో.. ఆమె కంటూ ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎప్పుడైతే ఆమె మయోసైటిస్ వ్యాధికి గురైందో అప్పటినుంచి ఆమె సినిమాలలో నటించడం మానేసింది. రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో సమంత సినిమాలకు కమిట్ అవ్వడం లేదంటూ తెగ ప్రచారం జరుగుతోంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/11/samantha1-1-jpg.webp)
అంతేకాదు సమంత బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు కమిట్ అవుతుందని.. ఇక తెలుగులో ఆమె సినిమాలు చేయదంటూ ట్రోల్ చేశారు. అయితే ఫైనల్లీ సమంత ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకి ఓకే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. ఈ సినిమా కచ్చితంగా ఆమెకు ‘ఏం మాయ చేసావే’ ఎలాంటి హిట్ ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/11/samantha1-jpg.webp)
మళ్లీ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని దూరం దూరంగా ఎవరి జీవితం వారు బతుకుతున్నారు. ప్రెసెంట్ సమంతకి తెలుగు లో సపోర్ట్ చేసే వాళ్లే లేరు..!!