Samantha : టాలీవుడ్ లో హీరోయిన్ సమంత, కమెడియన్ వెన్నల కిశోర్.. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సమంత నటించిన చాలా సినిమాల్లో వెన్నల కిశోర్ కూడా నటించాడు. తాజాగా వీరిద్దరూ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న మూవీ టీం తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్, సామ్, శివ నిర్వాణ, వెన్నల కిశోర్ పాల్గొన్నారు. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సందర్భాలని అభిమానులతో పంచుకున్నారు.

ఈక్రమంలోనే సమంత, కిశోర్ గురించి మాట్లాడుతూ.. “కిశోర్ కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎమోషనల్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. నేను నా ప్రతి సీన్ ని తనతో డిస్కస్ చేస్తాను. ఇది ఇలా చేయొచ్చా..? లేదా మరోలా చేయొచ్చా..? అని అడిగి తన దగ్గర సలహాలు తీసుకుంటా. నాకు కుదిరితే ఎప్పటికైనా తనని మెయిన్ లీడ్ లో పెట్టి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తాను” అని చెప్పుకొచ్చింది. మరి సమంత తన మాటని నిజం చేస్తూ వెన్నల కిశోర్ తో మూవీ చేస్తుందా..? లేదా..? అనేది భవిషత్తులో చూడాలి. ఖుషి విషయానికి వస్తే..

సెప్టెంబర్ 1న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.