Samantha : చైతును వదిలేసి సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ తో సమంత.. ఏకంగా కాస్ట్లీ గిఫ్టు కొట్టేసిందిగా ?

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. రెండ్రోజుల క్రితం సమంత బర్త్ డే జరగ్గా దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏప్రిల్ 28న తన బర్త్ డే స్నేహితులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది సామ్. ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, పలువురు ప్రముఖుల నుంచి బర్త్ డే విషెష్ వెల్లువెత్తాయి. అయితే సమంత తన బర్త్ డేను ఈసారి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రీస్ కు వెళ్లిన ఈ బ్యూటీ ఏథెన్స్ లో బర్త్ డే జరుపుకుంది. ఏథెన్స్ లో తాను తిరిగిన కొత్త కొత్త ప్రాంతాలు, అక్కడ జరుపుకున్న బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


ఈ నేపథ్యంలోనే తాజాగా సామ్ షేర్ చేసిన మరో ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో సమంత ఓ పిక్ ను జూమ్ చేసి మరీ షేర్ చేసింది. అందులో సామ్ రోజ్ గోల్డ్ చైన్ వేసుకుని కనిపిస్తోంది. దానికి కన్ను గుర్తుతో ఉన్న ఒక చిన్న లాకెట్ కూడా ఉంది. ఇక ఆ ఫోటోను చూసిన నెటిజెన్లు ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు? నీ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం బాయ్ ఫ్రెండ్ అయితేనే గిఫ్ట్ ఇవ్వాలా? అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఏడాది కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సామ్. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మయాసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో వరుసగా సినిమాల చేసే ప్లాన్ లో ఉంది. ఇప్పటికే ఆమె నటించిన సిటాడెల్, హనీ బన్నీ అనే వెబ్ సిరీసులు విడుదలకు రెడీ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా తన పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త మూవీని అనౌన్స్ చేసింది. మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రాబోతున్న ఆ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. పోస్టర్ లో సమంత ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఈ మూవీనీ ఆమె సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తుండడం మరో విశేషం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here