Naga Chaitanya : ప్రస్తుతం దుబాయ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న సమంతకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. తన మాజీ భర్త, నటుడు నాగ చైతన్య కోసం వేయించుకున్న పచ్చబొట్టును ఆమె తొలగించుకున్నారని పలువురు మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. పింక్ కలర్ చీరను ధరించి సమంత ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తాజాగా నెట్టింట షేర్ చేశారు.

గతంలో ఆమె నడుముపై ‘చై’ అని వేయించుకున్న టాటూ ఈ ఫొటోల్లో కనిపించలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘‘పచ్చబొట్టు తొలగించుకున్నారా?’’, ‘‘పచ్చబొట్టును తొలగించడం కష్టం. కాబట్టి, మేకప్ వేసి టాటూను కవర్ చేసినట్లు ఉన్నారు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమయంలో తమ ప్రేమకు గుర్తుగా సామ్ తన శరీరంపై మూడు పచ్చబొట్లు వేయించుకున్నారు.

అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడోది నడుము దగ్గర. ముఖ్యంగా నడుముపై ‘చై’ పేరుని రాయించుకున్నారు. సామ్-చై విడిపోయిన అనంతరం.. వాటిని ఆమె అలాగే ఉంచుకుంటారా? లేదా తీయించేస్తారా? ఏమైనా మార్పులు చేయించుకుంటారా? అని అభిమానులు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ తిరిగి కలవనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన తరుణంలో ‘చై’ టాటూ కనిపించకపోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.