Samantha మరియు నాగ చైతన్య విడిపోయిన రోజు నుండి నేటి వరకు సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి ఎదో ఒక వార్త రాని రోజంటూ లేదు.వీళ్ళు విడిపోవడానికి కారణం ఇదేనంటూ గత రెండు సంవత్సరాల నుండి వేల ఆర్టికల్స్ సోషల్ మీడియా లో ప్రచురితం అయ్యి ఉంటుంది.కానీ అటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య కానీ వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు చెప్పలేదు.

కానీ సమంత మాత్రం రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.విడాకులు జరిగిన తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని, ఈ అవకాశం వచ్చినప్పుడు అందరూ నన్ను ఆ పాట చెయ్యొద్దని చెప్పారు.విడాకులైన వెంటనే ఇలాంటి పాటలు ఎందుకు అని వారించారని, కానీ విడాకుల విషయం లో నా తప్పు ఏమి లేకపోయినా కూడా నేనెందుకు భయపడాలి అనే ఉద్దేశ్యం తోనే చేశాను అని చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియా లో వీళ్లిద్దరి విడాకులకు కారణం ఇదేనంటూ ఎన్ని కథనాలు వచ్చినా, అసలు కారణం మాత్రం అమల అనే అంటున్నారు.పెళ్ళైన దగ్గర నుండి అమల సమంత కి ప్రతీ విషయం లోను కండిషన్స్ పెట్టేదట.సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని, పొట్టి దుస్తులలో అసలు కనిపించకూడదని, బోల్డ్ పాత్రలలో నటించరాదని, పెళ్ళైన అమ్మాయి ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలని, అక్కినేని కుటుంబ పరువు పొయ్యేలా ఏ కార్యక్రమం కూడా చేయరాదని ఇలా ఎన్నో కండీషన్స్ పెట్టిందట.

ఇవన్నీ భరించలేకనే నాగ చైతన్య తో కలిసి వేరు కాపురం పెట్టిందట. వేరు కాపురం పెట్టిన తర్వాత నాగ చైతన్య అమల చెప్పినట్టే నడుచుకోవడం తో తరుచూ వీరి మధ్య గొడవలు వస్తుండేవని, అందుకే విడిపోయారు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. ఇది ఇలా ఉండగా సమంత ప్రధాన పాత్ర లో నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఈ నెల 14 వ తేదీన విడుదల కాబోతుంది.
