Samantha : రిజన్ ఏంటో తెలియదు కానీ.. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా సరే మన పేరు నెగటివ్ గా ట్రోల్ అవుతుంది. మంచి చేయాలని చూసినా సరే అది ఆటోమెటిక్ గా.. నెగెటివ్ గా వెళ్లిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సమంత ఈ మధ్యకాలంలో అలాంటి చిక్కుల్లో బాగా ఇరుక్కుంటుంది. హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని డివోర్స్ ఇచ్చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరు విడిపోయి కూడా దాదాపు రెండేళ్లు దాటిపోయింది.
అయినా ఇప్పటికీ వాళ్లకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. వారు కలుస్తారని ఒకసారి.. ఒకరికొకరు గుర్తు చేసుకుంటున్నారని మరోసారి ఇలా రోజుకోవార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గా హీరోయిన్ సమంత – తేజ సజ్జ హనుమ్యాన్ సినిమాను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన తప్పు ఏమాత్రం లేదు. కానీ కొందరు మాత్రం ఇది పరోక్షంగా అక్కినేని నాగార్జునను కించ పరిచే విధంగానే చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్న మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ సినిమాలను పట్టించుకోకుండా.. సమంత కేవలం తేజ సినిమాను మాత్రమే ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు పని లేని కొందరు జనాలు. మరికొందరు మాజీ మామకు ఇచ్చి పడేసిందంటూ సమంతను ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు అది ఆమె అభిప్రాయం.. మీకు ఎందుకురా మూసుకొని మీ పనులు చూసుకోండి అంటూ సమంతకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తరువాత సమంత పేరు మళ్లీ ఈస్ధాయిలో ట్రెండ్ అవుతూ ఉంది.