Samantha : నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో ఆనందంగా జరిగిన వీళ్ళ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. నాలుగేళ్లలోనే వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. అయితే నాగచైతన్య, సమంత విడిపోవడం ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా నచ్చని విషయం అవ్వడం నిజంగా అదొక సంచలనం అనే అనుకోవాలి. అయితే సమంత పెళ్లి ముందుకు వరకు ఒక రకమైన గ్లామర్ పాత్రలను నటించేది. పెళ్లి తర్వాత ఆమె ఒక రకమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుని నటించేది.. అయినా కూడా ఆమె సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. ఎందుకంటే ఆమె పెద్దగా ఎక్స్పోజింగ్ అలాంటివి చేయకపోయినా కూడా.. ఆమె తీసుకునే పాత్రల మీద నాగార్జున వాళ్ల ప్రభావం ఉండేది.

నాగార్జున, నాగచైతన్య, అక్కినేని కుటుంబం మొత్తం ఆమెకు అండగా ఉండడమంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమా రంగంలో అనుభవం ఉన్న కుటుంబం కనుక అన్ని రకాలుగా ఆలోచిస్తారు. అలాంటి కుటుంబం నుంచి నాగచైతన్య ని వదిలేసి బయటికి వచ్చేసిన తర్వాత సమంత విపరీతమైన ఫ్రీడంతో.. విపరీతమైన ఎక్స్పోజింగ్ చేస్తూ.. నటించడం మొదలు పెట్టింది. అయినా కూడా ఆమెకి సక్సెస్ అయితే ఏమీ హై రేంజ్ లో లేదు. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ తో ఆమె కెరీర్ చాలా కింద వరకు వెళ్లిపోయింది. దానికి తోడు సెటాడిల్ అనే వెబ్ సిరీస్ 2000 కోట్ల విలువచేసే పెట్టుబడితో తీసిన ఈ వెబ్ సీరియస్ ఇప్పుడు ఎలా ఉండబోతదో అని భయంతో ఉన్నారు.

ఎందుకంటే ఈ వెబ్ సీరీస్ హాలీవుడ్లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన సెటాడిల్ కు ఇది ఇండియన్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ని భారతీయ అన్ని భాషల్లోనూ కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. కానీ దీనికి మంచి రిజల్ట్ రాలేదు. ఎవరూ దీన్ని పెద్దగా ఆదరించలేదు. దీంతో ఇప్పుడు సమంతకు భయం పట్టుకుంది.
ఒరిజినల్ సిరీస్ ఎవరికీ నచ్చకపోతే. దాన్నే కొన్ని మార్పులు చేసి తీసిన ఇప్పుడు ఈ సీరీస్ నచ్చుతుందని నమ్మకం ఏమిటి? ఒకవేళ నచ్చకపోతే 2000 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? అని భయంలో ఉంది. ఈ విషయం తెలిసిన అభిమానులు అందరూ చైతూని వదులుకొని. తనకు సపోర్టర్స్, సలహా ఇచ్చే వాళ్ళని వదులుకొని.. చివరికి ఇన్ని వేల కోట్లు లాస్ అయిన ప్రాజెక్టులో సమంత భాగం అవడం. నిజంగా ఆమె కెరీర్ కి ఇంకా సమాధి లాంటి పనే అని అందరూ వాపోతున్నారు. మరికొందరేమో నాగచైతన్యను వదిలేశాక ఆమెకు ఇలా బ్యాడ్ లక్ పట్టుకుందని అంటున్నారు.