Samantha : కమ్ బ్యాక్ ఇచ్చిన సమంత.. మెరూన్ కలర్ డ్రెస్ లో అమ్మడు అదరహో

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బోల్డ్ ఫోటోల ద్వారా తరచూ సందడి చేస్తుంది. ఇటీవల ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించనని చెప్పినట్లు రుమార్లు విన్పిస్తున్నాయి. యశోద సినిమా టైంటో మయోసైటిస్‌తో బాధపడుతూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సమంత. ఆ తర్వాత మళ్లీ ఖుషీ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకుని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుంది.

కానీ సమంతకు రీ ఎంట్రీ తరువాత తెలుగు సినిమా అవకాశాలు రావడం లేదని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏడాది పాటు విరామం తీసుకుంటే ఆ గ్యాప్‌లో చాలా మంది కొత్త నటీమణులు ఎంట్రీ ఇస్తారు. సమంత విషయంలో కూడా అలాగే అయింది. అందుకే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు కూడా తక్కువే వస్తున్నాయి అంటున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది సమంత. అలాగే ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో సమంత నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం సినిమా చేయాలనుకున్నా తెలుగు స్టార్ హీరోలెవరూ ఆమెకు సపోర్ట్ చేయలేదని సమంత అన్నట్టుగా టాక్ నడుస్తోంది.

- Advertisement -

సమంత ప్రస్తుతం హెల్త్ పాడ్ కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు చెబుతూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతుంది. పలు యాడ్స్ చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, సమంత మెరూన్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అందులో స్టైలిష్‌గా హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఇక ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ఓ మై గాడ్ సమంత అంటూ షాక్ అవుతున్నారు. అలాగే మరికొందరు మాత్రం లవ్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here