Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. ఈ పోస్ట్ అర్థం అదేనా..!

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత విషయాలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆమె వేసే ప్రతి అడుగు, ఆమె చేసే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ ఇష్యూ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఓ కొటేషన్ వైరల్ గా మారింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత.. మ్యారేజ్ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ డివోర్స్ కి కారణాలేంటి అనేది బయటకు రాకపోయినా.. అప్పటి నుంచి సమంత తీరు అనుక్షణం పసిగడుతూ వస్తున్నారంతా.

Samantha
Samantha

అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఓ కొటేషన్ చూసి మళ్లీ ఆమె ప్రేమలో పడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ కొటేషన్ పంచుకుంది సమంత. ఇది చూసి ఇంకా సమంతకు ప్రేమ మీద ఎలాంటి ఆశ చావలేదని చెప్పుకుంటున్నారు జనం. అప్పుడప్పుడు నువ్వు ఎక్కువ ద్వేషించే మనుషులు, ద్వేషించే మాటలను చూసి.. విని ఉంటావేమో కానీ.. ఈ ప్రపంచంలో మనం ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటూ సమంత పెట్టిన ఓ కొటేషన్‌ వైరల్ అవుతోంది. అయితే ఇది మరో వ్యక్తిని ఉద్దేశించి పెట్టిందా? లేక ప్రస్తుతం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా తన ఫీలింగ్స్ బయటపెట్టిందా అనేది క్లారిటీ లేదు.

ఏది ఏమైనా ప్రేమ విషయంలో మాత్రం సమంత చాలా పాజిటివ్ గా ఉన్నట్లు ఈ పోస్ట్ స్పష్టం చేస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే విహార యాత్రలో ఛిల్ అవుతోంది. ఆయా ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. వెకేషన్ లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లిన సమంత.. ఎప్పకప్పుడు ఆ విశేషాలను అభిమానులతో పంచుకుంటోంది. బాలీ ద్వీపంలో ఎంజాయ్ చేస్తూ వరుస ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. తనకున్న ఖాళీ సమయాన్ని మానసిక ప్రశాంతత కోసం కేటాయిస్తోంది సమంత. ఇష్టమైన వ్యక్తులతో కలిసి విహార యాత్రలో ఛిల్ అవుతోంది. ప్రస్తుతం దీవుల దేశం ఇండోనేషియాలో ఆమె పర్యటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here