సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో సమంతని విలన్ గా చూపిస్తూ, ఆమెనే ఎక్కువ తప్పుపట్టే వారు సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో రెండవ పెళ్ళికి సిద్దమై, ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడో, అప్పుడే సమంత తప్పు ఏమి లేదనీ, కేవలం శోభితతో నాగ చైతన్య రహస్య సంబంధం పెట్టుకోవడం వల్లే వీళ్లిద్దరు విడిపోయారని అందరికీ అర్థమైంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సమంత గురించి మరో సంచలన నిజం బయటపడింది. అదేమిటంటే నాగ చైతన్యని ఆమె పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే గర్భం దాల్చింది అట. కానీ కేవలం శోభిత దూళిపాళ్ల కారణంగానే అబార్షన్ అయ్యిందని అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది.
అప్పట్లో సమంత శోభితా ని ఉద్దేశిస్తూ ‘మా ఇంట్లోకి ‘ఎస్’ అనే పదం తో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి అడుగుపెట్టింది. ఆ వ్యక్తి కారణంగా మా జీవితాలే మారిపోతున్నాయి’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ కూడా పెట్టిందట. కాసేపటి తర్వాత ఆ స్టోరీ ని ఆమె డిలీట్ కూడా చేసిందని సమంత అభిమానులు చెప్తున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య – సమంత విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో మొదట వార్త రావడానికి కారణం సమంత ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో తన అకౌంట్స్ కి పేర్లు మార్చడం వల్లే. సమంత అక్కినేని నుండి ఆమె ‘s’ గా మార్చింది. అంటే అప్పుడే ఆమె ‘s’ అనే వ్యక్తి వల్ల మేము విడిపోతున్నాము అంటూ పరోక్షంగా అభిమానులకు చెప్పకనే చెప్పింది అన్నమాట.
అంతే కాదు శోభిత విషయం లో నాగ చైతన్య తో ఇంట్లో ఎన్నో సార్లు గొడవలు కూడా పెట్టుకుందట సమంత. చాలా వరకు నాగ చైతన్య తో రిలేషన్ ని ఆమె నిలబెట్టెనుకునే ప్రయత్నం చేసింది, కానీ చివరికి నిలబెట్టుకోలేక పోయింది. ఇప్పటికీ కూడా ఆమె ఈ విడాకుల వ్యవహారం నుండి పూర్తి స్థాయిలో బయట పడలేకపోతుంది. అప్పుడప్పుడు ఆమె తన బాధని పరోక్షంగా స్టోరిల రూపం లో ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బయటకి ఆమె చెప్పేలేకపోయిన లోపల మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంది ఉంటుందని, ఆమె ఆ బాధ నుండి త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.